చంద్రబాబు అబద్ధాలు చూస్తుంటే సముద్రం ఇంకిపోతుందేమో అనిపిస్తోంది: పవన్
- టీడీపీ, కాంగ్రెస్‌లు తినడానికి పనికిరాని లడ్డూలు
- వైసీపీ లడ్డూ వాళ్లకు మాత్రమే పనికొచ్చే లడ్డూ
- బీజేపీ పాచిపోయిన లడ్డూ
రూ.వేల కోట్ల ఖనిజం వంతాడ కొండల నుంచి మాయమవుతున్నా.. రియల్‌టైం గవర్నెన్స్ అంటున్న చంద్రబాబుకు ఈ విషయం తెలియదా? అని పవన్ ప్రశ్నించారు. అభివృద్ధి కేంద్రీకృతం వల్ల జిల్లాల మధ్య ఘర్షణలు తలెత్తే అవకాశాలున్నాయన్నారు. గతంలో హైదరాబాద్‌ని అభివృద్ధి చేసి దెబ్బతిన్నామని.. మళ్లీ ఇప్పుడు చంద్రబాబు అదే బాటలో అమరావతిని అభివృద్ధి చేస్తున్నారని పవన్ దుయ్యబట్టారు.