ప్రజాసంకల్ప యాత్ర, తన ఆరోగ్యంపై స్పందించిన వైఎస్ జగన్!
- అభిమానుల ప్రార్థనలతో కోలుకున్నా
- 12న ప్రజాసంకల్పయాత్రలో పాల్గొంటా
- ఫేస్ బుక్ లో పోస్ట్ చేసిన వైసీపీ అధినేత
కాగా, జగన్ పై హత్యాయత్నం ఘటనపై ఆయన కుటుంబ సభ్యులు రేపు ఉదయం 11 గంటలకు మీడియా ముందుకు రానున్నారు. వైసీపీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ ఈ సమావేశంలో మీడియాను ఉద్దేశించి మాట్లాడనున్నారు. జగన్ పై దాడి తదనంతర పరిణామాలపై ఆమె వివరణ ఇవ్వనున్నారు. గత నెల 25న విశాఖపట్నం ఎయిర్ పోర్టులో జగన్ పై శ్రీనివాసరావు అనే యువకుడు కోడికత్తితో దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో జగన్ ఎడమ చేతికి 9 కుట్లు పడ్డాయి.