సినిమా నిర్మాణం దిశగా రాజమౌళి తనయుడు కార్తికేయ!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

సినిమా నిర్మాణం దిశగా రాజమౌళి తనయుడు కార్తికేయ!

  • 'ఆకాశవాణి' చిత్ర నిర్మాతగా కార్తికేయ 
  • దర్శకుడిగా పరిచయం కానున్న అశ్విన్ 
  • చారిత్రక నేపథ్యంలో సాగే కథ    
అపజయమెరుగని దర్శకుడిగా రాజమౌళి తెలుగు ప్రేక్షకుల మనసులను దోచుకున్నారు. ఆయన తనయుడు కార్తికేయకి సినిమాకి సంబంధించిన అన్ని విభాగాలపై మంచి పట్టుంది. రాజమౌళి సినిమాలకి సంబంధించిన చాలా విషయాలను ఆయన దగ్గరుండి చూసుకుంటూ ఉంటాడు. దాంతో రాజమౌళి మాదిరిగానే ఆయన మెగా ఫోన్ పట్టుకోవచ్చని అంతా అనుకున్నారు.

దర్శకత్వంపై కార్తికేయకి ఆసక్తి వుందో లేదో తెలియదుగానీ, నిర్మాతగా మారడానికి రంగాన్ని సిద్ధం చేసుకుంటున్నట్టుగా సమాచారం. ఆయన నిర్మించే సినిమాకి అశ్విన్ దర్శకుడిగా వ్యవహరిస్తాడట. ఈ అశ్విన్ .. రాజమౌళి దగ్గర దర్శకత్వ శాఖలో పనిచేసినవాడే కావడం విశేషం. కార్తికేయ - అశ్విన్ కాంబినేషన్లో రూపొందనున్న సినిమాకి 'ఆకాశవాణి' అనే టైటిల్ ను అనుకుంటున్నారట. చారిత్రక నేపథ్యంలో రూపొందే ఈ సినిమా పూర్తి వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.     
karthikeya
ashwin

More Telugu News