జగన్, పవన్ లను ఆడిస్తున్న ఢిల్లీ పెద్దలు: ఏపీ మంత్రి నారాయణ
Add ap7am to your home Screen

జగన్, పవన్ లను ఆడిస్తున్న ఢిల్లీ పెద్దలు: ఏపీ మంత్రి నారాయణ

  • వారిద్దరి స్క్రిప్ట్ ఢిల్లీ నుంచే వస్తోంది
  • కేంద్రాన్ని ప్రశ్నించే ధైర్యం చేయలేని పవన్, జగన్
  • నెల్లూరులో మీడియాతో నారాయణ
ఏపీ విపక్ష నేత వైఎస్ జగన్, జనసేన అధినేత పవన్ కల్యాణ్ లు ఢిల్లీలోని బీజేపీ పెద్దలు చెప్పినట్టుగా ఆడుతున్నారని మునిసిపల్ శాఖా మంత్రి నారాయణ విమర్శించారు. ఈ ఉదయం నెల్లూరులో మీడియాతో మాట్లాడిన ఆయన, వీరిద్దరికీ స్క్రిప్ట్ ఢిల్లీ నుంచి వస్తోందని అన్నారు.

విభజన హామీలను విస్మరించిన బీజేపీని ఇద్దరు నేతలూ వెనకేసుకు వస్తున్నారని ఆరోపించారు. హామీలను అమలు చేయని కేంద్రాన్ని పవన్, జగన్ లు ప్రశ్నించడం లేదని విమర్శించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జనసేనలు రాష్ట్రానికి ద్రోహం చేసిన పార్టీల జాబితాలో చేరిపోయాయని, వారికి టీడీపీని, చంద్రబాబును విమర్శించే నైతిక అర్హత లేదని మండిపడ్డారు.
P Narayana
Andhra Pradesh
Pawan Kalyan
Jagan
YSRCP
Jana Sena

More Telugu News