ఏమాత్రం వెనక్కి తగ్గని శశి థరూర్.. ఈసారి మోదీని మరో రకంగా అభివర్ణించిన కాంగ్రెస్ నేత
- మొన్న శివలింగంపై తేలన్న థరూర్
- నేడు తెల్లని గుర్రంపై కత్తి పైకెత్తి కూర్చున్న హీరోగా అభివర్ణన
- థరూర్ పై పరువు నష్టం దావా
తాజాగా, శనివారం మరోమారు మోదీపై థరూర్ విరుచుకుపడ్డారు. నాకన్నీ తెలుసు అన్నట్టు తెల్లని మగ గుర్రంపై కత్తి పైకెత్తి కూర్చున్న హీరోగా మోదీని అభివర్ణించారు. మోదీ ఒక్కరే ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారని, మిగతావారందరూ ఆయన చెప్పినట్టు ఆడుతున్నారని ఆరోపించారు. కాగా, థరూర్ తేలు వ్యాఖ్యలపై ఢిల్లీలో ఆయనపై పరువునష్టం కేసు నమోదైంది. థరూర్ వ్యాఖ్యలతో ఓ మతం మనోభావాలు దెబ్బతిన్నాయని కేసు వేసినట్లు బీజేపీ నేత బాబర్ పేర్కొన్నారు.