ఆశ్చర్యచకితులను చేస్తోన్న '2.ఓ' ట్రైలర్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఆశ్చర్యచకితులను చేస్తోన్న '2.ఓ' ట్రైలర్

  • శంకర్ నుంచి రానున్న '2.ఓ'
  • కళ్లు చెదిరిపోయే గ్రాఫిక్స్ 
  • ఈ నెల 29వ తేదీన విడుదల  
బలమైన కథాకథనాలకు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడించి శంకర్ '2.ఓ' సినిమాను రూపొందించాడు. రజనీకాంత్ కథానాయకుడిగా .. అక్షయ్ కుమార్ ప్రతినాయకుడిగా ఈ సినిమా నిర్మితమైంది. అలాంటి ఈ సినిమా నుంచి తాజాగా ట్రైలర్ ను రిలీజ్ చేశారు. నాయకుడికి .. ప్రతినాయకుడి మధ్య జరిగే వార్ నేపథ్యంలో సీన్స్ పైనే ఈ ట్రైలర్ ను కట్ చేశారు.

రాకాసి పక్షి సృష్టించే విధ్వంసం ఈ ట్రైలర్ కి హైలైట్ గా నిలుస్తోంది. అది హీరోను వెంటాడే షాట్స్ చూస్తే ఈ సినిమాలో గ్రాఫిక్స్ ఒక రేంజ్ లో వున్నాయనే విషయం అర్థమవుతోంది. ఉన్నట్టుండి అందరి చేతుల్లోని సెల్ ఫోన్లు గాల్లోకి ఎగిరిపోవడం .. 'సెల్ ఫోన్ వాడుతున్న వాళ్లంతా హంతకులే' అనే డైలాగ్ ను అక్షయ్ కుమార్ చెప్పడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. నవంబర్ 29వ తేదీన ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. ఈ సినిమా సంచలనానికి తెరతీయనుందనే విషయం ట్రైలర్ ను బట్టి అర్థమవుతోంది.
rajani
akshay
amy jackson

More Telugu News