అందాల అంజలి మరీ చిక్కిపోయిందే!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

అందాల అంజలి మరీ చిక్కిపోయిందే!

  • తెలుగు .. తమిళ భాషల్లో క్రేజ్ 
  • ఇటీవల తగ్గిన అవకాశాలు 
  • బొద్దుగా ఉంటేనే బాగుందనే కామెంట్స్
తెలుగు .. తమిళ భాషల్లో అంజలికి మంచి క్రేజ్ వుంది. తెలుగు అమ్మాయి అయినా ముందుగా తమిళంలో రాణించి, ఆ తరువాత తెలుగులో క్రేజ్ తెచ్చుకోవడం విశేషం. ఈ రెండు భాషల్లోనూ ఆమె విభిన్నమైన పాత్రలను పోషించి మెప్పించింది. కానీ ఇటీవలే ఆమెకి అవకాశాలు తగ్గాయి. బొద్దుగా ఉంటూనే యూత్ హృదయాలను కొల్లగొట్టేసిన అంజలి, ఇప్పుడు బాగా సన్నబడిపోయింది.

తన ఫేస్ బుక్ లోను .. ట్విట్టర్ లోను ఆమె పోస్ట్ చేసిన ఫోటోలు చూసినవాళ్లు ఆశ్చర్యపోతున్నారు .. అంతగా అంజలి సన్నబడిపోయింది. నిజం చెప్పాలంటే ఒక్కసారిగా ఈ ఫోటో చూసిన వాళ్లు అంజలి అంటే నమ్మరు. మరి ఏదైనా సినిమాలో పాత్ర కోసం ఆమె సన్నబడిందా? బొద్దుగా ఉండటం వల్లనే అవకాశాలు రావడం లేదనే ఉద్దేశంతో బరువు తగ్గిందా? అనేది తెలియడం లేదు. ఈ ఫోటోలు చూసిన వాళ్లు మాత్రం అంజలి మరీ సన్నబడిపోయిందనీ, ఆమె బొద్దుగా ఉంటేనే బాగుందనే కామెంట్స్ చేస్తున్నారు. 
anjali

More Telugu News