సన్యాసంలో కలిసిపోయిన భార్య.. మళ్లీ పెళ్లికి సిద్ధమైన '65 ఏళ్ల కుర్రాడు'!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

సన్యాసంలో కలిసిపోయిన భార్య.. మళ్లీ పెళ్లికి సిద్ధమైన '65 ఏళ్ల కుర్రాడు'!

  • తనకంటే 30 ఏళ్లు చిన్నదైన జూలీతో వివాహం
  • 10 ఏళ్ల కాపురం అనంతరం వదిలి వెళ్లిపోయింది
  • పెళ్లి చేసుకుంటానని ఫేస్‌బుక్‌లో పోస్ట్
పాట్నా విశ్వవిద్యాలయంలో హిందీ అధ్యాపకుడిగా పనిచేసి అక్టోబర్ 31న పదవీ విరమణ పొందిన మకుట్‌నాథ్ మళ్లీ పెళ్లికి సిద్ధమవుతున్నారు. ఇప్పటికే తనకంటే 30 ఏళ్లు చిన్నదైన జూలీని ఆయన వివాహం చేసుకున్నారు. పదేళ్ల కాపురం అనంతరం ఆమె ఆయన్ను వదిలేసి సన్యాసంలో కలిసిపోయిందట. ఈ విషయాన్ని స్వయంగా మకుట్‌నాథే వెల్లడించారు. అయితే జూలీతో ఉన్న అనుబంధాన్ని ఓ పుస్తకంగా రాసి దానికి ‘మకుట్ జూలీకి డైరీ’ అనే పేరు పెట్టి ఇటీవల ఓ కార్యక్రమంలో విడుదల చేశారు. దీంతో ఆయన లవ్ గురూ’గా పాట్నాలో ప్రసిద్ధి చెందారు. ఇప్పుడు మళ్లీ పెళ్లికి సిద్ధమవుతున్నారు.

‘నేను 65 ఏళ్ల కుర్రాడిని. రిటైర్మెంట్‌ తర్వాత ఏం చేయబోతున్నానని చాలా మంది అడుగుతున్నారు. నాకు మళ్లీ పెళ్లి చేసుకోవాలని ఉంది. నా భార్య జూలీతో నేను పదేళ్లు కలిసున్నాను. గతేడాది ఆమె సన్యాసంలో కలిసిపోతానని నన్ను వదిలి వెళ్లిపోయింది’ అని చెప్పారు. ఈ విషయాన్ని ఫేస్‌బుక్‌లో కూడా పెట్టడంతో ఎన్నో ప్రపోజల్స్ వస్తున్నాయట. కాకపోతే ఎంచుకోవడం కష్టంగా మారడంతో ఈ విషయాన్ని తన విద్యార్థులకే వదిలేసినట్టు మకుట్ నాథ్ వెల్లడించారు.
Patna
Makutnath
Hindi Proffecer
juli
Love Guru

More Telugu News