జగన్ పై దాడి నిందితుడు శ్రీనివాస్ కు పూర్తి భద్రత కల్పిస్తాం: చినరాజప్ప
- విచారణలో నిష్పక్షపాతంగా వ్యవహరిస్తున్నాం
- శ్రీనివాస్ భద్రత విషయంలో అనుమానాలు వద్దు
- విపక్ష నేతలు అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నారు
మరోవైపు, తనకు ప్రాణహాని ఉందని, రక్షణ కల్పించాలని శ్రీనివాస్ వేడుకున్న సంగతి తెలిసిందే. తనను చంపి రాజకీయం చేయాలనుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. నిన్న కేజీహెచ్ కు తరలిస్తున్న సమయంలో మీడియాకు ఈ విషయాన్ని తెలిపాడు. తాను జగన్ అభిమానినని, ఆయన కోసమే ఈ పని చేశానని చెప్పాడు.