జగన్ గాయంపై విశాఖ వైద్యులు చెప్పిన దానిని ధ్రువీకరించిన హైదరాబాద్ వైద్యులు
- గాయంలో ఎలాంటి విషపదార్థాలు లేవన్న సిటీ న్యూరో సెంటర్
- గాయం మానేందుకు మరో ఆరు వారాలు
- జగన్‌ను పరీక్షించిన డాక్టర్ శివారెడ్డి బృందం
జగన్ నివాసమైన లోటస్‌పాండ్‌లో విశ్రాంతి తీసుకుంటున్న జగన్‌మోహన్ రెడ్డిని మంగళవారం డాక్టర్ శివారెడ్డి బృందం పరీక్షించింది. ఆరోగ్య పరిస్థితిని సమీక్షించింది. ఈ సందర్భంగా డాక్టర్ శివారెడ్డి మాట్లాడుతూ.. గాయం చిన్నదేనని, అయితే, పూర్తిగా తగ్గేందుకు మరో ఆరు వారాల సమయం పడుతుందని పేర్కొన్నారు. కొన్ని జాగ్రత్తలతో జగన్ పాదయాత్రలో పాల్గొనవచ్చని తెలిపారు.