ఢిల్లీకి చేరుకున్న చంద్రబాబు.. మరికాసేపట్లో కేజ్రీవాల్, యశ్వంత్ సిన్హాతో భేటీ!

27-10-2018 Sat 13:17 | Andhra
  • టీడీపీ ఎంపీలతో చంద్రబాబు భేటీ
  • భవిష్యత్ కార్యాచరణపై చర్చ
  • 3 గంటలకు జాతీయ మీడియాతో సమావేశం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు ఢిల్లీ చేరుకున్నారు. తొలుత ఏపీ భవన్ లో టీడీపీ పార్లమెంటు సభ్యులతో బాబు సమావేశమయ్యారు. జగన్ పై దాడి, గవర్నర్ నరసింహన్ వ్యవహారశైలి, పలు ప్రాజెక్టులపై కేంద్రం సహాయ నిరాకరణ సహా పలు అంశాలపై వారితో చర్చించారు. కేంద్రం కుట్రలను జాతీయ స్థాయిలో ఎండగట్టాలని ఈ సమావేశంలో నిర్ణయించారు.

ఇందులో భాగంగా ఈరోజు మధ్యాహ్నం 1.30 గంటలకు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, కేంద్ర మాజీ మంత్రి యశ్వంత్ సిన్హా, శరద్ యాదవ్ తదితరులు చంద్రబాబుతో భేటీ కానున్నారు. వీరంతా ఏపీ భవన్ లో చంద్రబాబుతో సమావేశమై దేశవ్యాప్తంగా నెలకొన్న రాజకీయ పరిస్థితి, పాలనలో గవర్నర్ల అనవసర జోక్యంపై  చర్చించనున్నారు. ఏపీలో రాష్ట్రపతి పాలన విధించేందుకు కేంద్రం యత్నిస్తోందని భావిస్తున్న టీడీపీ అధినేత.. ప్రధాని మోదీ ఎత్తులకు చెక్ పెట్టే దిశగా అడుగులు వేస్తున్నారు.

ఢిల్లీలోని ఏపీ భవన్ లో విశ్రాంతి తీసుకుంటున్న చంద్రబాబు ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు ఢిల్లీలోని కాన్ స్టిట్యూషన్ క్లబ్ లో జాతీయ మీడియా సమావేశంలో పాల్గొంటారు. కాగా, ఈ సమావేశంలో చంద్రబాబు కాంగ్రెస్ పార్టీతో కలిసి వెళతారా? లేక మూడో కూటమిని ప్రకటిస్తారా? అన్న విషయమై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.
ChandrababuNew DelhiArvind Kejriwalyeswant sinhasharad yadavpress meet3PMChief MinisterAndhra Pradeshparliamentmember of prarliament

More Telugu News

భారత్-పాక్ మ్యాచ్‌లు క్రీడ కాదు.. రాజకీయ వ్యవహారం: శశి థరూర్ సంచలన వ్యాఖ్యలు

25-10-2026 Sun 08:46

యూపీ, ఒడిశాలో నేడు ప్రధాని మోదీ పర్యటన.. పలు కీలక కార్యక్రమాలకు శ్రీకారం

25-10-2026 Sun 08:29

రూ.500 కోట్ల ఆడియో కలకలం.. మహారాష్ట్ర మిత్రపక్షాల్లో మాటల మంటలు!

25-10-2026 Sun 08:28

మక్కాపై దాడి చేయలేదు.. సౌదీ చమురు క్షేత్రాలే మా లక్ష్యం: హౌతీ రెబల్స్

25-10-2026 Sun 08:03

పింఛన్ బకాయిలపై హైకోర్టు కీలక తీర్పు.. దరఖాస్తు తేదీ నుంచే చెల్లించాలని ఆదేశం

25-10-2026 Sun 07:46

పాదరసాన్ని బంగారంగా మార్చేశాం.. అమెరికా స్టార్టప్‌ సంచలన ప్రకటన!

25-10-2026 Sun 07:37

అమెరికాలో అయ్యప్ప శరణుఘోష.. మైనస్ డిగ్రీల చలిలోనూ కఠిన దీక్షలు!

25-10-2026 Sun 06:52

బాల్కనీలో మినీ కన్సర్ట్... గిటార్‌తో అదరగొట్టిన సైఫ్ అలీ ఖాన్!

25-10-2026 Sun 06:30

శర్వానంద్ 'జార్జ్ క్రిష్' సినిమా నుంచి లేటెస్ట్ అప్డేట్

25-10-2026 Sun 06:17

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03
..more