జగన్ పచ్చినెత్తురు తాగే వ్యక్తి.. వైఎస్ రాజారెడ్డిలా చంద్రబాబు అన్నం పెట్టినవారిని చంపలేదు!: కేశినేని నాని
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

జగన్ పచ్చినెత్తురు తాగే వ్యక్తి.. వైఎస్ రాజారెడ్డిలా చంద్రబాబు అన్నం పెట్టినవారిని చంపలేదు!: కేశినేని నాని

  • ఏపీలో జగన్నాటకం జరుగుతోంది
  • మీలా రాజకీయ హత్యలు చేయలేదు
  • ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు కుట్ర
జగన్నాటకం అన్న విషయాన్ని గతంలో పురాణాల్లో విన్నామనీ, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో చూస్తున్నామని టీడీపీ పార్లమెంటు సభ్యుడు కేశినేని నాని విమర్శించారు. జగన్ పై దాడి కేసులో చంద్రబాబు ఏ-1 అనీ, డీజీపీ ఏ-2 అని వైసీపీ నేత వైవీ సుబ్బారెడ్డి చెప్పడాన్ని ఆయన ఖండించారు. రాజారెడ్డి లాగా చంద్రబాబు ఎన్నడూ సామూహిక హత్యలు చేయలేదనీ, రాజకీయ ఎదుగుదల కోసం అన్నం పెట్టినవారిని చంపలేదని వ్యాఖ్యానించారు.

కొడుకు వైఎస్ రాజకీయ ప్రస్థానం కోసం రాజారెడ్డిలా చంద్రబాబు ఎన్నడూ రాజకీయ హత్యలు చేయించలేదని స్పష్టం చేశారు. ఈ రోజు ఢిల్లీలో నిర్వహించిన మీడియా సమావేశంలో నాని మాట్లాడారు. ఈ రోజు పలు ఆర్థిక నేరాల్లో సైతం ప్రతిపక్ష నేత జగన్ పేరు వస్తోందని కేశినేని నాని తెలిపారు.

ఇలాంటి సందర్భాల్లో ఏ-1గా చంద్రబాబు పేరు ఉండాలా? లేక రాజశేఖరరెడ్డి కుటుంబం పేరు ఉండాలా? అని ప్రశ్నించారు. వైఎస్ జగన్ పచ్చినెత్తురు తాగే వ్యక్తి అని విమర్శించారు. బీజేపీతో కుమ్మక్కయిన వైసీపీ నేతలు టీడీపీ ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు కుట్ర పన్నుతున్నారని మండిపడ్డారు.
Andhra Pradesh
Hyderabad
Jagan
Kesineni Nani
Chandrababu
ys rajasekhar reddy
Telugudesam
knife
attacked

More Telugu News