ఫ్యాన్స్ కు బర్త్ డే గిఫ్ట్... న్యూలుక్ లో ఇరగదీస్తున్న 'సాహో' ప్రభాస్!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఫ్యాన్స్ కు బర్త్ డే గిఫ్ట్... న్యూలుక్ లో ఇరగదీస్తున్న 'సాహో' ప్రభాస్!

  • నేడు ప్రభాస్ 39వ పుట్టిన రోజు
  • శుభాకాంక్షలు తెలుపుతున్న సెలబ్రిటీలు
  • 'సాహో' కొత్త పోస్టర్ విడుదల
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పుట్టిన రోజు సందర్భంగా 'సాహో' టీమ్ ఆయన అభిమానులను సర్ ప్రైజ్ చేసింది. 'సాహో'లోని ప్రభాస్ కొత్త లుక్ ను విడుదల చేశారు. యూవీ క్రియేషన్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, బాలీవుడ్ హీరోయిన్ శ్రద్ధాకపూర్, ప్రభాస్ కు జోడీగా నటిస్తోన్న సంగతి తెలిసిందే. సుజిత్ దర్శకత్వం వహిస్తున్నాడు. 'షేడ్స్ ఆఫ్ షాడో' పేరిట విడుదలైన తాజా పోస్టర్ పై 'చాప్టర్ 1' అని రాసుండటం గమనార్హం. నేడు ప్రభాస్ తన 39వ పుట్టినరోజును జరుపుకుంటుండగా, ఆయనకు పలువురు టాలీవుడ్ సెలబ్రిటీలు శుభాకాంక్షలు తెలిపారు.
Sahoo
Prabhas
Birthday

More Telugu News