సంగీత దర్శకుడు అను మాలిక్ లైంగికంగా వేధించాడు: డేనికా డిసౌజా
- ఇండియన్ ఐడల్ షోలో ఘటన
- పెద్దలకు తెలిసినా పట్టించుకోలేదు
- నిర్మాణ సంస్థ ఉద్యోగిని డేనికా డిసౌజా ఆరోపణ
ఇండియన్ ఐడల్ ను నిర్వహిస్తున్న సంస్థలో పనిచేసిన డేనికా, తనపై తరచూ వేధింపులు జరిగాయని, అక్కడి పెద్దలకు ఈ విషయం తెలిసినా పట్టించుకోలేదని ఆరోపించింది. డేనికా ఆరోపణలతో తాజా ఇండియన్ ఐడల్ నుంచి అను మాలిక్ ను తప్పించే యోచన జరుగుతున్నట్టు తెలుస్తోంది. కాగా, తనపై వచ్చిన ఆరోపణలను అనూ మాలిక్ ఖండించాడు. తాను ఎవరినీ వేధించలేదని స్పష్టం చేశాడు.