కాంగ్రెస్ సామాజిక న్యాయం... గతంలో ఎన్నడూ లేని విధంగా బీసీలకు 30 శాతం సీట్లు!
- తెలంగాణలో 57 శాతం బీసీల జనాభా
- 34 స్థానాలు ఇచ్చే యోచనలో కాంగ్రెస్
- ఒక్కో ఎంపీ స్థానంలో రెండు బీసీ అసెంబ్లీ సీట్లు, కొన్నింట మూడు
ఆపై మాదిగలకు 12, మాలలకు 7, లంబాడీలకు 6, ఆదివాసీలకు 6 టికెట్లు ఇవ్వాలని కూడా భావిస్తున్నామని చెప్పారు. ఒక్కో పార్లమెంట్ నియోజకవర్గంలో ఇద్దరు బీసీలకు టికెట్ ఇవ్వాలని హైకమాండ్ నుంచి ఆదేశాలు వచ్చినట్టు వెల్లడించారు. ఒక పార్లమెంట్ స్థానంలో రిజర్వేషన్ సమస్యల కారణంగా బీసీలకు కుదరకుంటే, మరో పార్లమెంట్ నియోజకవర్గంలో అధిక సీట్లను బీసీలకు కేటాయిస్తామని టీపీసీసీ చెబుతోంది. గతంలో ఎన్నడూ బీసీలకు 30 శాతం సీట్లను ఇవ్వలేదని, బడుగుల అభ్యన్నతికి కాంగ్రెస్ కట్టుబడివుందని చెప్పడానికి ఇప్పుడిస్తున్న సీట్ల సంఖ్యే నిదర్శనమని వారు అభిప్రాయపడ్డారు.