దసరా సందర్భంగా ఫ్యాన్స్ కు ప్రభాస్ మెసేజ్... 23న సర్ప్రైజ్ ఉంటుందన్న ప్రభాస్!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

దసరా సందర్భంగా ఫ్యాన్స్ కు ప్రభాస్ మెసేజ్... 23న సర్ప్రైజ్ ఉంటుందన్న ప్రభాస్!

  • 'సాహో' నుంచి ఆశిస్తున్న అభిమానులు
  • 23న చెబుతానంటూ ప్రభాస్ పోస్ట్ 
  • కొత్త సినిమా టైటిల్ కావచ్చని అభిమానుల అంచనా
దసరా సందర్భంగా ప్రభాస్ తాజా చిత్రం 'సాహో'కు సంబంధించిన ఏదైనా విడుదల అవుతుందని చూస్తున్న అభిమానులకు ప్రభాస్ నుంచి ఓ మెసేజ్ వచ్చింది. దాన్ని చూసిన తరువాత తాము మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందేనని అభిమానులకు తెలిసిపోయింది. అక్టోబర్ 23న ప్రభాస్ పుట్టిన రోజన్న విషయం ఫ్యాన్స్ అందరికీ తెలిసిన విషయమే.

ఇక దసరా నాడు 'సాహో' లేదా రాధాకృష్ణ దర్శకత్వంలో తాను నటించే లవ్ స్టోరీ సినిమాకు సంబంధించిన ఏదైనా విశేషాన్ని చూడొచ్చని భావిస్తున్న అభిమానులకు సస్పెన్స్ పెంచుతూ, "డియర్‌ ఫ్యాన్స్‌... ఈ నెల 23న మీ అందరికీ ఓ సర్‌ ప్రైజ్‌ ఇవ్వబోతున్నందుకు చాలా ఎగ్జయిటింగ్ గా ఉంది. అందరికీ దసరా శుభాకాంక్షలు" అని ప్రభాస్ తన ఫేస్ బుక్ లో ఓ పోస్టు పెట్టారు.

 ఇక నాలుగు రోజుల్లో ఈ సినిమా టీజర్ లేదా ట్రయిలర్ వస్తుందని కొందరు అనుకుంటుంటే, కొత్త సినిమా పేరు బయటకు వస్తుందని మరికొందరు భావిస్తున్నారు. కాగా, ప్రభాస్, పూజాహెగ్డే కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమాకు ఫ్రెంచ్ భాషకు చెందిన 'అమూర్' అనే పేరును అనుకుంటున్నట్టు తెలుస్తోంది. ఇక ఇదే పేరును అధికారికంగా 23న ప్రకటిస్తారా? లేదా మరేదైనా సస్పెన్స్ రివీల్ చేస్తారా? అన్న విషయం తెలియాలంటే, నాలుగు రోజులు ఆగక తప్పదు.
Prabhas
Fans
Sahoo
New Movie
Dasara
Birth Day

More Telugu News