అమృత తండ్రి మారుతీరావుపై మరో రెండు కేసుల నమోదు
- ప్రణయ్ బంధువులను పిలిపించుకుని బెదిరించిన మారుతీరావు
- ప్రణయ్ కదలికల గురించి చెప్పాలంటూ ఒత్తిడి
- చెప్పకపోతే చంపేస్తామంటూ బెదిరింపులు
ప్రణయ్ కదలికలను తమకు తెలియజేయాలని, వారి రిసెప్షన్ ను అడ్డుకోవాలని కోరారు. దీనికి అశోక్, దినేష్ లు తిరస్కరించగా... చంపుతామని బెదిరించారు. ఈ మేరకు అశోక్, దినేష్ లు పట్టణ వన్ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసులకు సంబంధించే నిందితులను పోలీసులు కోర్టులో ప్రవేశపెట్టారు. కేసును విచారించిన అదనపు జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ నిందితులకు ఈనెల 29 వరకు జ్యుడిషియల్ రిమాండ్ విధించారు.