సందడిగా మారిన ఉప్పల్ పరిసరాలు... నేటి నుంచి రెండో టెస్టు!
- ఉదయం 9.30 నుంచి వెస్టిండీస్ తో టెస్టు
- తొలి టెస్టును గెలిచిన ఊపుమీదున్న ఇండియా
- కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసిన పోలీసులు
ఐదు రోజుల పాటు మ్యాచ్ జరగనుండగా, పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. అభిమానులు ఒక్క మొబైల్ ఫోన్లు మినహా మరేమీ తీసుకు రావడానికి వీల్లేదన్న ఆదేశాలు జారీ అయ్యాయి. స్టేడియంలో ప్రేక్షకుల సంఖ్య తక్కువగా ఉంటే, స్కూలు పిల్లలను తరలించేందుకు హెచ్సీఏ ఏర్పాట్లు చేసింది. ఈ మ్యాచ్ ఉదయం 9.30 గంటల నుంచి ప్రారంభం కానుంది.