దిలీప్ కుమార్ ఆరోగ్యం విషయంలో ఆందోళన వద్దు: లీలావతి ఆస్పత్రి
- న్యూమోనియాతో బాధపడుతున్న దిలీప్ కుమార్
- ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది
- దిలీప్ కుమార్ ఆరోగ్యంపై ఆయన భార్య మౌనం
తాజాగా ఫైజల్ ట్విట్టర్ ద్వారా దిలీప్ కుమార్ ఆరోగ్య పరిస్థితిని వివరించారు. ‘సైరాగారికి, లీలావతి ఆస్పత్రికి విపరీతంగా ఫోన్ కాల్స్ వస్తున్నాయి. దయచేసి దిలీప్ కుమార్ ఆరోగ్య పరిస్థితిపై అడగకండి. వారిని వారి పనులు చేయనివ్వండి. ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి అన్ని వివరాలనూ నేను దిలీప్ కుమార్ ట్విట్టర్ ఖాతాలోనే పోస్ట్ చేస్తాను. మీ ప్రార్థనలు, అర్థం చేసుకుంటున్న తీరుకి కృతజ్ఞతలు’ అని పేర్కొన్నారు.
అలాగే ఆస్పత్రి ఉపాధ్యక్షుడు అజయ్ కుమార్ కూడా ఈ రోజు మీడియాతో మాట్లాడుతూ... ‘ఆయన ఆరోగ్యం నిలకడగా ఉంది. ఈ విషయంపై ఆందోళన చెందాల్సిన అవసరం ఏ మాత్రమూ లేదు’ అని తెలిపారు.