బహిరంగ సభలో.. విజయనగరం అసెంబ్లీ అభ్యర్థిని ప్రకటించిన వైఎస్ జగన్!
- వచ్చే ఎన్నికల్లో కోలగట్ల వీరభద్రస్వామి పోటీ చేస్తారు
- విజయనగరం విషజ్వరాల జిల్లాగా మారింది
- వైఎస్సార్ సీఎం అయ్యే వరకూ ఈ జిల్లా వెనుకబడే ఉంది
2004లో వైఎస్సార్ సీఎం అయ్యే వరకు కూడా విజయనగరం జిల్లా అన్ని రంగాల్లో వెనుకబడి ఉండేదని, వైఎస్సార్ సీఎం అయ్యాక ఐదేళ్ల కాలంలో విజయనగరం జిల్లాలో అనేక అభివృద్ధి ప్రాజెక్టులు చేపట్టారని అన్నారు. ప్రస్తుతం ఈ జిల్లాలో నీటి ప్రాజెక్టులు పడకేశాయని, బీమ్ సింగ్ చక్కెర కర్మాగారం నష్టాల్లో కూరుకుపోయిందని, అందులోని ఉద్యోగుల పరిస్థితి దయనీయంగా మారిందని, విజయనగరం విషజ్వరాల జిల్లాగా మారిందని అన్నారు.