తమిళనాట 'నవాబ్' దూకుడు.. 50 కోట్ల క్లబ్ దిశగా పరుగులు!
- ఈ నెల 27న వచ్చిన 'చక్క చివంత వానమ్'
- 4 రోజుల్లోనే 30 కోట్ల గ్రాస్ వసూలు
- మణిరత్నం కెరియర్లో బెస్ట్ ఓపెనింగ్స్
మొదటి మూడు రోజులకు గాను ఈ సినిమా 21.70 కోట్ల గ్రాస్ ను వసూలు చేసింది. నిన్న ఆదివారం రోజున 8 కోట్ల గ్రాస్ వసూలు చేసి 30 కోట్ల క్లబ్ లోకి చేరిపోయింది. మణిరత్నం కెరియర్లో బెస్ట్ ఓపెనింగ్స్ ను రాబట్టిన సినిమా ఇదేనని చెబుతున్నారు. ఇక రేపు సెలవు రోజు కావడంతో ఈ రెండు రోజుల్లోను కలుపుకుని ఈ సినిమా 50 కోట్ల క్లబ్ లోకి చేరిపోవడం ఖాయమని అంటున్నారు.