సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

  • చిరంజీవికి జోడీగా తమన్నా!
  • మరో సీక్వెల్ యోచనలో కమల్ 
  • 'ఆర్ఎక్స్ 100' హీరోకి మరో సినిమా 
  • నాగశౌర్యతో గీతా ఆర్ట్స్ చిత్రం   
*  చిరంజీవి నటించే 152వ చిత్రానికి కొరటాల శివ దర్శకత్వం వహించనున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ చిత్రం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. కాగా, ఈ చిత్రంలో కథానాయికగా తమన్నా నటించనున్నట్టు తెలుస్తోంది.
*  ప్రస్తుతం 'భారతీయుడు' సీక్వెల్ లో నటిస్తున్న ప్రముఖ నటుడు కమలహాసన్ ఇప్పుడు మరో సీక్వెల్ పై దృష్టి పెట్టాడు. గతంలో వచ్చిన 'దేవర మగన్' (క్షత్రియ పుత్రుడు) చిత్రానికి సీక్వెల్ చేసే ఆలోచన చేస్తున్నాడట.  
*  'ఆర్ఎక్స్ 100' చిత్రం ద్వారా గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరో కార్తికేయ తాజాగా ఓ చిత్రానికి ఓకే చెప్పాడు. నూతన దర్శకుడు వెంకట్ చంద్ర దర్శకత్వంలో రూపొందే చిత్రంలో నటించనున్నాడు. ఇందులో రెజ్లర్ పాత్రలో కార్తికేయ నటిస్తాడని తెలుస్తోంది. మరోపక్క ప్రముఖ నిర్మాత కలైపులి ఎస్ థాను నిర్మించే తమిళ, తెలుగు చిత్రం 'హిప్పి'లో కూడా కార్తికేయ నటిస్తున్నాడు.
*  ఇటీవల వచ్చిన 'నర్తనశాల' సినిమా పరాజయం పాలవడంతో నిరాశకు గురైన యంగ్ హీరో నాగశౌర్యకు తాజాగా లక్కీ చాన్స్ తగిలింది. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ తమ గీతా ఆర్ట్స్ బ్యానర్లో నాగశౌర్య హీరోగా ఓ చిత్రాన్ని నిర్మిస్తారని సమాచారం. 
Thamanna
chiranjivi
Kamal Haasan
nagashourya

More Telugu News