చేసిన తప్పును వెంటనే సరిదిద్దుకోండి.. లేకపోతే తీవ్రమైన పర్యవసానాలను ఎదుర్కొంటారు: అమెరికాకు చైనా వార్నింగ్
- మా మిలిటరీపై విధించిన ఆంక్షలను వెంటనే ఎత్తి వేయండి
- అమెరికా చర్యతో ఇరు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి
- అమెరికా చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం
అంతర్జాతీయ సంబంధాలకు అమెరికా చర్యలు తీవ్ర విఘాతాన్ని కలిగించాయని జెంగ్ అన్నారు. ఇరు దేశాలు, ఇరు దేశాల మిలిటరీల మధ్య ఉన్న సంబంధాలు అమెరికా తీరుతో దారుణంగా దెబ్బతిన్నాయని చెప్పారు. తమ మిలిటరీపై విధించిన ఆంక్షలను వెనక్కి తీసుకోవాలని, చేసిన తప్పును వెంటనే సరిదిద్దుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో తీవ్ర పర్యవసానాలను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని హెచ్చరించారు.