ఆ పాత్ర నాగార్జున కోసం అనుకున్నది కాదట!
- రజనీకాంత్ గారి కోసం ఆ పాత్రను డిజైన్ చేశాను
- రాజకీయాలతో ఆయన బిజీగా వున్నారు
- ఆ కారణంగానే తనకి కుదరదని చెప్పారు
తాజా ఇంటర్వ్యూలో ధనుశ్ మాట్లాడుతూ .. "ఈ సినిమాలో నాగార్జునగారు చేస్తోన్న పాత్ర ముందుగా ఆయన కోసం అనుకున్నది కాదు. ఈ పాత్రను రజనీకాంత్ గారితో చేయించాలనే ఉద్దేశంతో ఆయనను దృష్టిలో పెట్టుకుని డిజైన్ చేసినది. రజనీకాంత్ గారు రాజకీయాలతో బిజీగా వుంటూ తాను చేయలేనని చెప్పేశారు. దాంతో నాగార్జున గారైతే బాగుంటుందని అనుకున్నాను. 70 కోట్ల బడ్జెట్ తో రూపొందుతోన్న ఈ సినిమా, నాగార్జునగారికి గల క్రేజ్ కారణంగా తెలుగులోను దూసుకుపోతుందనే నమ్మకం వుంది" అంటూ చెప్పుకొచ్చాడు.