ఆ సర్వేతో నాకు సంబంధం లేదు.. తేల్చి చెప్పిన లగడపాటి!
- లగడపాటి సర్వే పేరుతో సోషల్ మీడియాలో హల్చల్
- ఓ పార్టీకి అనుకూలంగా ఉండడంతో షేర్ల మీద షేర్లు
- ఎన్నికల షెడ్యూలు తర్వాతే తన సర్వే ఉంటుందన్న లగడపాటి
తన సర్వే పేరిట జరుగుతున్న ప్రచారంపై లగడపాటి రాజగోపాల్ స్పందించారు. ఆ సర్వే తనది కాదని, దానితో తనకు ఎటువంటి సంబంధం లేదని తేల్చి చెప్పారు. శుక్రవారం ఆయన ఓ చానల్‌తో మాట్లాడుతూ... సోషల్ మీడియాలో జరుగుతున్నదంతా తప్పుడు ప్రచారమన్నారు. ఆ సర్వే ఫలితాలకు, తనకు ఏమాత్రం సంబంధం లేదన్నారు. ఎన్నికల షెడ్యూలు విడుదలై, నామినేషన్ల ప్రక్రియ పూర్తయిన తర్వాతే సర్వే చేసి ఫలితాలను వెల్లడిస్తానని ఆయన వివరించారు. అప్పటి వరకు తన పేరిట ఏం జరిగినా నమ్మవద్దని సూచించారు.