దాసరి కోడలిపై దాడి..పోలీసులను ఆశ్రయించిన బాధితురాలు!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

దాసరి కోడలిపై దాడి..పోలీసులను ఆశ్రయించిన బాధితురాలు!

  • తన భర్త మాజీ భార్య సుశీలపై ఫిర్యాదు
  • ఇంట్లోకి అక్రమంగా వచ్చిందని వెల్లడి
  • క్రిమినల్ కేసు నమోదుచేసిన పోలీసులు
ప్రముఖ దర్శకుడు దివంగత దాసరి నారాయణ రావు కోడలు దాసరి పద్మ జూబ్లిహిల్స్ పోలీసులను ఆశ్రయించారు. తన భర్త మొదటి భార్య ఇంట్లోకి చొరబడి తనపై దాడిచేసిందని ఫిర్యాదులో పేర్కొన్నారు. జూబ్లీహిల్స్ లోని రోడ్ నం.46లోని ఇంట్లో తాను, తన భర్త దాసరి తారకహరిహర ప్రభుతో ఉంటున్నానని తెలిపారు. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 10న రాత్రి 7 గంటలకు తన భర్త మాజీ భార్య సుశీల, మరో మహిళ సంధ్యను వెంటపెట్టుకుని అక్రమంగా తమ ఇంట్లోకి ప్రవేశించిందన్నారు.

ఆ రోజు రాత్రి సుశీల, సంధ్య ఇద్దరూ తమ ఇంట్లోనే ఉన్నారనీ, తనపై దాడి కూడా చేశారని వెల్లడించారు. ఈ సమయంలో తన భర్త ఇంట్లో లేడని వాపోయారు. ఈ ఘటనపై ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు దాసరి సుశీలపై క్రిమినల్ కేసు నమోదు చేశారు. కాగా, ప్రభు ఆస్తిలో తనకు వాటా ఉందని సుశీల వాదిస్తున్నారు.
dasari
prabhu
Hyderabad

More Telugu News