పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకున్న విమానం.. కుప్పకూలి 21 మంది మృతి!
- 19 మందికే అనుమతి ఉండగా అంతకుమించి ఎక్కించుకున్న వైనం
- సరస్సులో కుప్పకూలిన కమర్షియల్ విమానం
- ప్రాణాలతో బయటపడిన ముగ్గురిలో ఆరేళ్ల బాలిక
జుబా అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి యిరోల్ నగరానికి బయలుదేరిన కమర్షియల్ విమానం కాసేపటికే ఓ సరస్సులో కుప్పకూలింది. ప్రమాదంలో 21 మంది అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్ర గాయాలతో బయటపడిన నలుగురిలో ఆరేళ్ల బాలిక, మరో చిన్నారి, ఇటాలియన్ వైద్యుడు, ఓ యువకుడు ఉన్నట్టు అధికారులు తెలిపారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వీరిలో వైద్యుడి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలిపారు. ప్రమాదంపై దర్యాప్తు జరుపుతున్నట్టు అధికారులు తెలిపారు.