ఆంధ్ర పార్టీ నుంచే ఎమ్మెల్యే అయ్యావ్.. దమ్ముంటే సింగిల్ గా ఓయూకు వెళ్లు: కేసీఆర్ కు ఎల్.రమణ సవాల్

  • టీడీపీ ఆంధ్ర పార్టీ కాదు.. అందరి పార్టీ
  • కారణం లేకుండానే అసెంబ్లీని రద్దు చేశారు
  • అన్ని పార్టీలను కలుపుకుని, టీఆర్ఎస్ ను పెకిలిస్తాం
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు టీటీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ సవాల్ విసిరారు. దమ్ముంటే ఉస్మానియా యూనివర్శిటీకి సింగిల్ గా వెళ్లాలని ఛాలెంజ్ చేశారు. టీడీపీని ఆంధ్ర పార్టీ అని కేసీఆర్ అంటున్నారని... అదే పార్టీ నుంచి ఆయన ఎమ్మెల్యే, మంత్రి అయ్యారన్న సంగతిని మర్చిపోరాదని చెప్పారు. టీడీపీ అనేది ఆంధ్ర పార్టీ కాదని... అందరి పార్టీ అని అన్నారు. కొడంగల్ నుంచి కోదాడ వరకు టీడీపీకి బలం ఉందని చెప్పారు. ఎలాంటి కారణం లేకుండానే అసెంబ్లీని కేసీఆర్ రద్దు చేశారని మండిపడ్డారు. టీఆర్ఎస్ ను కూకటివేళ్లతో పెకిలించడానికి, అన్ని పార్టీలను కలుపుకుని వెళ్తామని చెప్పారు. టీడీపీ లేకుండా ఏ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం లేదని అన్నారు.
Go Back to Shorts
kcr
l ramana
Telugudesam
osmania university

More Telugu News