'అత్తారింటికి దారేది' తమిళ రీమేక్ లో మేఘా ఆకాశ్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

'అత్తారింటికి దారేది' తమిళ రీమేక్ లో మేఘా ఆకాశ్

  • నిరాశపరిచిన 'లై' .. 'ఛల్ మోహన్ రంగ'
  • తెలుగులో రాని అవకాశాలు 
  • తమిళ సినిమాలపై దృష్టి  
హీరోకైనా .. హీరోయిన్ కైనా వరుస అవకాశాలను తెచ్చిపెట్టేవి విజయాలే. సక్సెస్ లేనప్పుడు ఎవరూ పలకరించరు .. పట్టించుకోరు. అలా సక్సెస్ లేకపోవడం వల్లనే తెలుగు నుంచి మేఘా ఆకాశ్ కి అవకాశాలు కరువయ్యాయి. తెలుగు తెరకి 'లై' చిత్రం ద్వారా మేఘా ఆకాశ్  పరిచయమైంది. ఆ తరువాత సినిమాగా 'ఛల్ మోహన్ రంగా' చేసింది. దురదృష్టం కొద్దీ ఈ రెండు సినిమాలు కూడా పరాజయం పాలయ్యాయి.

లుక్ పరంగా కుర్రకారు నుంచి మంచి మార్కులు పడినప్పటికీ, సక్సెస్ లేని కారణంగా వెనుకబడిపోయింది. దాంతో ఆమె తమిళంలో నిలదొక్కుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ప్రస్తుతం ఆమె తమిళంలో అధర్వ జోడీగా 'బూమరాంగ్' చేస్తోంది. ఈ సినిమా సెట్స్ పై ఉండగానే, మరో తమిళ సినిమాను అంగీకరించింది. ఇది 'అత్తారింటికి దారేది' సినిమాకి రీమేక్. ఒక కథానాయికగా ఆమెను ఎంపిక చేసుకున్నట్టుగా సమాచారం. ఈ నెలలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది.  
megha akash

More Telugu News