రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ‘చేపల అమ్మాయి’ హనన్ హమీద్
- దుకాణం ప్రారంభోత్సవానికి వెళ్లి వస్తుండగా ప్రమాదం
- అదుపు తప్పి చెట్టును ఢీకొన్న కారు
- వెన్నెముకకు తీవ్ర గాయం
కాగా, సోమవారం కోజికోడ్‌లో ఓ దుకాణం ప్రారంభోత్సవానికి వెళ్లివస్తున్న హనన్ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడింది. ఆమె ప్రయాణిస్తున్న కారు కొడంగళూర్ వద్ద చెట్టును ఢీకొట్టింది. రోడ్డుపై అడ్డంగా వచ్చిన వ్యక్తిని తప్పించబోయిన డ్రైవర్ కారును ఒక్కసారిగా పక్కకు తిప్పడంతో అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న చెట్టును ఢీకొట్టింది. ప్రమాదంలో హనన్ వెన్నెముకకు తీవ్ర గాయమైంది. వెంటనే ఆమెను కొడంగళూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన చికిత్స కోసం అక్కడి నుంచి ఎర్నాకుళం తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు.