రక్తమోడుతున్న చేతులతో సిగరెట్... 'అర్జున్ రెడ్డి' తొలి ఫొటో... 'ఏం క్రేజయ్యా' అంటున్న నెటిజన్లు!
- 'అర్జున్ రెడ్డి' విడుదలై ఏడాది
- తొలి పిక్ ను షేర్ చేసుకున్న విజయ్ దేవరకొండ
- నిమిషాల్లో వేలాది షేర్లు, లైక్స్
చేతుల నిండా రక్తపు మరకలతో సిగరెట్ తాగుతున్నట్టున్న ఈ చిత్రం, నిమిషాల్లో వైరల్ అయిపోయింది. దీనికి లైకుల మీద లైకులు, వేలల్లో షేర్లు వచ్చాయి. దీంతో యువతలో విజయ్ దేవరకొండకు ఎంత క్రేజ్ ఉందో మరోసారి తెలిసొచ్చింది. ఈ పిక్ చూసిన వాళ్లంతా వెరైటీగా కామెంట్స్ చేస్తున్నారు. "ఏందయ్యా ఇది? ఇంత క్రేజా?" అని ప్రశ్నిస్తున్న వారూ లేకపోలేదు. "నువ్వు ఏం చేసినా ఇంతేనా?", "నీ టైమ్ నడుస్తోంది" అన్న కామెంట్లూ వచ్చాయి.