తల్లిపాలు తాగి రొమ్ములు గుద్దొద్దు: 'లీకు' వీరులకు చిరంజీవి హెచ్చరిక
- స్నేహితులకు ముందే చూపాలన్న కుర్రతనం వద్దు
- సినిమాలను ముందే బయటకు పంపితే కోట్ల నష్టం
- వందల మంది కడుపు కొట్టొద్దన్న చిరంజీవి
సినిమా బాగుంటే ప్రేక్షకులు నెత్తిన పెట్టుకుంటారని చెప్పడానికి ఈ సినిమాయే ఉదాహరణని వ్యాఖ్యానించారు. తనకు 'ఖైదీ' ఎలాగో, విజయ్ దేవరకొండకు 'గీత గోవిందం' అలా నిలిచిపోతుందని చిరంజీవి కితాబిచ్చారు. తొలుత యువతను ఆకట్టుకున్న విజయ్, ఇప్పుడు కుటుంబ ప్రేక్షకులకూ దగ్గరయ్యాడని అన్నారు. కళ్లతోనే కోపాన్ని ప్రదర్శించిన హీరోయిన్ రష్మికకు మంచి భవిష్యత్ ఉందని చెప్పారు.