అక్టోబర్ లో తెలంగాణ అసెంబ్లీ రద్దు... డిసెంబర్ లో ఎన్నికలు!
- 'ఒకే దేశం - ఒకే ఎన్నిక'కు తెలంగాణ అనుకూలం
- కుదరకుంటే నాలుగు నెలల ముందుగానే ఎన్నికలకు
- ప్రధాని నరేంద్ర మోదీకి సమాచారం ఇచ్చిన కేసీఆర్!
'ఒకే దేశం - ఒకే ఎన్నిక' సాధ్యం కాని పక్షంలో, తాము కనీసం నాలుగు నెలల ముందుగా ఎన్నికలకు వెళతామని ఆయన ప్రధానికి తేల్చి చెప్పినట్టు అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇప్పటికే అసెంబ్లీ రద్దుకు న్యాయ నిపుణుల సలహాలు తీసుకున్న కేసీఆర్, సీనియర్ మంత్రులతోనూ చర్చించినట్టు తెలుస్తోంది. కాగా, సెప్టెంబర్ లేదా అక్టోబర్ లో తెలంగాణ అసెంబ్లీ రద్దయితే, సంవత్సరం చివరిలో జరగాల్సిన రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలతో కలిపి తెలంగాణలో ఎన్నికల నిర్వహణకు అభ్యంతరం లేదని ఈసీ కూడా వెల్లడించినట్టు తెలుస్తోంది.