అత్తమామలకు అమెరికా పౌరసత్వాన్ని ప్రసాదించిన డొనాల్డ్ ట్రంప్!
- గురువారం నాడు అమెరికా పౌరులుగా ప్రమాణం
- విక్టర్, అమాలిజాలతో ప్రమాణం చేయించిన అధికారులు
- తాను స్పందించాల్సిన అవసరం లేదన్న మెలానియా ట్రంప్
ట్రంప్ అధ్యక్షుడైన తరువాత వీరిద్దరికీ పౌరసత్వం లభిస్తుందని అందరూ భావించారు. తాజాగా, అందుకు సంబంధించిన ప్రక్రియ పూర్తయింది. మన్ హటన్ ఫెడరల్ బిల్డింగ్ లో హోమ్ ల్యాండ్ సెక్యూరిటీ అధికారుల సమక్షంలో వీరు ప్రమాణం చేశారని విక్టర్ తరఫు న్యాయవాది మైఖేల్ వీల్డ్స్ వెల్లడించారు. అయితే, తన తల్లిదండ్రులకు పౌరసత్వంపై వ్యాఖ్యానించేందుకు మెలానియా నిరాకరించడం గమనార్హం. వారు ఇరువురూ పాలనలో భాగస్వాములు కాదు కాబట్టి, మెలానియా స్పందించాల్సిన అవసరం లేదని ఆమె తరఫు ప్రతినిధి స్టెఫానీ గ్రిషామ్ వెల్లడించారు.