'గూఢచారి' చూస్తున్నంత సేపు చప్పట్లు కొడుతూనే వున్నాను: నాగార్జున
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

'గూఢచారి' చూస్తున్నంత సేపు చప్పట్లు కొడుతూనే వున్నాను: నాగార్జున

  • తక్కువ వనరులతో బాగా తీశారు
  • ఆడియన్స్ ను ప్రభావితం చేసింది
  • కొన్ని సీన్స్ చూసి షాక్ అయ్యాను
అడవి శేష్ ప్రధానమైన పాత్రను పోషించిన 'గూఢచారి' ఇటీవలే థియేటర్లకు వచ్చింది. తొలి రోజునే ఈ సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఆ తరువాత మౌత్ టాక్ తోనే మరింతగా వసూళ్లు పుంజుకున్నాయి. ఈ నేపథ్యంలో ఈ సినిమాను గురించి నాగార్జున స్పందించారు. "పెద్ద మొత్తంలో తమ సినిమాలకి ఖర్చు పెట్టేస్తూ తామంతా ఏదేదో చేస్తున్నామనీ, కానీ చాలా తక్కువ బడ్జెట్ తో వచ్చిన 'గూఢచారి' ఘన విజయాన్ని సాధించిందని అన్నారు.ఈ ఏడాది 'రంగస్థలం' .. 'మహానటి' భారీ విజయాలను సాధించాయి. ఆ స్థాయి విజయాన్ని సాధించినది 'గూఢచారి'నే. వసూళ్ల పరంగానే కాదు ప్రేక్షకులపై ఎంతటి ప్రభావం చూపింది .. పరిశ్రమకి ఎలాంటి పాఠాలు నేర్పింది అనేది కూడా పరిగణనలోకి తీసుకోవాలి. వనరుల పరంగా చూసుకుంటే 'రంగస్థలం' .. 'మహానటి' సినిమాలకి మించిన విజయాన్ని 'గూఢచారి' సాధించినట్టే. ఈ సినిమా చూస్తున్నంత సేపు నేను చప్పట్లు కొడుతూనే వున్నాను. కొన్ని సీన్స్ చూసి నేను షాక్ అయ్యాను" అన్నారు.            
adivi shesh
supriya

More Telugu News