ఇది నా గొప్పతనం కాదు: నటుడు జీవా
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఇది నా గొప్పతనం కాదు: నటుడు జీవా

  • బాలచందర్ గారు నాకు ఛాన్స్ ఇచ్చారు 
  • నిర్మాత రంజిత్ కుమార్ ప్రోత్సహించారు 
  • అలా నా సినీరంగ ప్రవేశం జరిగింది  
తెలుగు తెరపై విభిన్నమైన కథా చిత్రాలలో .. విలక్షణమైన పాత్రల్లో కనిపించిన నటుల్లో జీవా ఒకరుగా కనిపిస్తాడు. అలాంటి జీవా తాజాగా ఐ డ్రీమ్స్ ఇంటర్వ్యూలో తన మనోభావాలను ఆవిష్కరించారు. "నటుడిగా జీవా ఏదైనా సాధించాడు అంటే అది నా గొప్పతనం కాదు .. దర్శక నిర్మాతలదే ఆ గొప్పతనమనేది నా అభిప్రాయం. ఒక నటుడిని ఎలా ఉపయోగించాలనే భావన దర్శకులకు వుంటుంది. దర్శకుడు చెప్పింది అర్థం చేసుకుని నిర్మాత ప్రోత్సహిస్తుంటాడు.

 ఏ ఆర్టిస్ట్ అయినా కానివ్వండి కెరియర్ పరంగా ఎదిగాడు అంటే దానికి మూలం దర్శక నిర్మాతలే. నేను ఎదగడానికి నేనే కారణమని ఏ ఆర్టిస్ట్ అయినా అనుకుంటే అందుకు నేను ఒప్పుకోను. నేను ఈ స్థాయికి రావడం నా ఘనత కాదు. నన్ను మొదటిసారిగా కె. బాలచందర్ గారు తెరకి పరిచయం చేశారు. ఆయన ఎంపికను సమర్థించి నిర్మాత రంజిత్ కుమార్ గారు నన్ను ప్రోత్సహించారు. అలా నేను సినిమాల్లోకి రావడం .. విభిన్నమైన పాత్రల కారణంగా మంచి పేరు రావడం జరిగింది" అని చెప్పుకొచ్చారు.  
jeeva

More Telugu News