ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ సీడబ్ల్యూసీ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం: కోమటిరెడ్డి
- కవిత, టీఆర్ఎస్ ఎంపీలు కూడా హోదాకు మద్దతు తెలిపారు
- తెలంగాణ వచ్చిన సంతోషం ఏ ఒక్కరిలో లేదు
- కేసీఆర్ కుటుంబానికి తప్ప.. మంత్రులకు కూడా అధికారాలు లేవు
తెలంగాణ వచ్చిన సంతోషం ఏ ఒక్కరిలో లేదని... కేవలం పాలకులు మాత్రమే ఆనందంగా ఉన్నారని కోమటిరెడ్డి అన్నారు. కేసీఆర్ కుటుంబసభ్యులకు తప్ప ఇతర మంత్రులకు కూడా అధికారాలు లేవని విమర్శించారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కాగితాలపై తప్ప, వాస్తవంగా లేదని తెలిపారు.