అమ్మా! నువ్వు నా పక్కన వుంటే చాలు!: అనుష్క
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

అమ్మా! నువ్వు నా పక్కన వుంటే చాలు!: అనుష్క

  • అనుష్క తల్లి పుట్టిన రోజు నేడు 
  • తల్లితో కేక్ కట్ చేయించిన స్వీటీ 
  • అమ్మ తోడుగా వుంటే ఏదైనా సాధించగలనన్న అనుష్క
తెలుగు .. తమిళ భాషల్లో నిన్నటి వరకు అనుష్క అగ్రకథానాయికగా వెలుగొందింది. 'అరుంధతి' .. 'రుద్రమదేవి' .. 'భాగమతి' వంటి సినిమాలు అసమానమైన అనుష్క నటనకు అద్దం పడుతుంటాయి. అలాంటి అనుష్క .. ఈ రోజు పుట్టిన రోజు వేడుక జరుపుకుంటోన్న తన తల్లికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసింది. తల్లి దగ్గరే వుండి కుటుంబ సభ్యుల సమక్షంలో ఆమెతో కేక్ కట్ చేయించింది.

'నువ్వు నా పక్కనే వుంటే జీవితంలో ఏమైనా సాధించగలను .. హ్యాపీ బర్త్ డే అమ్మా' అంటూ ట్వీట్ చేసింది. తల్లిపట్ల తనకి గల ప్రేమను .. ఆమె తనకి ఇస్తోన్న ధైర్యాన్ని ఈ ఒక్క మాటతో అనుష్క ఆవిష్కరించింది. ఈ ట్వీట్ తో .. ఈ రోజున అనుష్క తల్లి పుట్టినరోజు అని తెలుసుకున్న అభిమానులు .. ఆమెకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

ఇదిలా ఉంచితే, 'భాగమతి' తరువాత అనుష్క ఏ సినిమాకి సైన్ చేయలేదు. ఒక వైపున పెళ్లి ప్రయత్నాలు జరుగుతున్నాయనే టాక్ వినిపిస్తూ వుంటే, మరో వైపున చంద్రశేఖర్ యేలేటితో సినిమా చేయనుందనే ప్రచారం జరుగుతోంది. ఇందులో వాస్తవమెంతో చూడాలి మరి.       
anushka

More Telugu News