200 రోజులు ఆగండి.. చుక్కలు చూపిస్తా: తెలుగుదేశం నేతలకు కొడాలి నాని వార్నింగ్
- పోలీసులు, అధికారులు టీడీపీ తొత్తులుగా మారారని మండిపాటు
- తెలుగుదేశాన్ని గుడివాడలో భూస్థాపితం చేస్తానని ప్రకటన
- మీడియా సమావేశంలో నిప్పులు చెరిగిన నాని
తనను గుడివాడ నుంచి తరిమికొడతామని తెలుగుదేశం నేతలు చెప్పడంపై నాని తీవ్రంగా స్పందించారు. ఇంకో 200 రోజులు ఆగితే గుడివాడలో టీడీపీని భూస్థాపితం చేస్తానని ఆయన స్పష్టం చేశారు. అప్పుడు టీడీపీ నేతల్ని తరిమితరిమి కొడతానన్నారు. వైఎస్సార్ సీపీ నేతలను ఇబ్బందులకు గురిచేస్తున్న నేతలకు అసలు రాజకీయ జీవితమే లేకుండా చేస్తానని హెచ్చరించారు.