ఫ్యాషన్ ప్రపంచానికి గుడ్ బై చెప్పిన ఇవాంకా ట్రంప్!
- ఫ్యాషన్ బ్రాండ్ నుంచి తప్పుకున్న ఇవాంకా
- వైట్ హౌస్ పై దృష్టి సారిస్తానని వెల్లడి
- ఇక వ్యాపారంపై దృష్టిని సారించలేనన్న ఇవాంకా
"మేము ఈ బ్రాండ్ ను ప్రారంభించినప్పుడు ఇంత విజయవంతం అవుతుందని ఏ మాత్రమూ అనుకోలేదు" అంటోంది ఇవాంకా. "వాషింగ్టన్ లో 17 నెలల పాటు గడిపాను. ఇప్పుడు వ్యాపారంపై దృష్టిని సారించాలని లేదు. భవిష్యత్తుపై దృష్టిని సారించాల్సిన పరిస్థితుల్లో వైట్ హౌస్ లోనే ఉండాలని నిర్ణయించుకున్నాను. నా టీమ్, భాగస్వాముల మేలు కోరి పారదర్శకంగా ఆలోచించిన మీదటే ఈ నిర్ణయం తీసుకున్నాను" అని ఇవాంకా ట్రంప్ ఓ ప్రకటనలో తెలిపారు.
కాగా, అమెరికాలో రిటైల్ చైన్ నిర్వహిస్తున్న నోర్డ్ స్ట్రామ్, నేమన్ మార్కస్ లతో పాటు కెనడా రిటెయిలర్ హడ్సన్ బే తదితరాలు ఇవాంకా బ్రాండ్ విక్రయాలను నిలిపివేశాయి. ఇవాంక తీసుకున్న నిర్ణయాన్ని తాము స్వాగతిస్తున్నామని, అమెరికా తొలి కుమార్తెగా ఆమె తీసుకున్న నిర్ణయం తమకు బాధ కలిగించేదే అయినా శిరసావహిస్తామని ఇవాంకా ట్రంప్ బ్రాండ్ అధ్యక్షుడు అబిగేల్ క్లెమ్ వెల్లడించారు.