'ఇడియట్' కోసం వెతికితే.. గూగుల్ ఎవరి ఫొటోలను ఎక్కువగా చూపుతోందో తెలుసా?
Add ap7am to your home Screen

'ఇడియట్' కోసం వెతికితే.. గూగుల్ ఎవరి ఫొటోలను ఎక్కువగా చూపుతోందో తెలుసా?

  • ఇడియట్ కోసం వెతికితే ట్రంప్ ఫొటోలను చూపుతున్న గూగుల్
  • ట్రంప్ ఫోటోకు ఇడియట్ అనే పదాన్ని జోడిస్తున్న ఆయన వ్యతిరేకులు
  • ట్రంప్ పాలసీలు నచ్చనివారు చేస్తున్న క్యాంపెయిన్ లో ఇదొక రకం
గూగుల్ మరోసారి పతాక శీర్షికల్లోకి ఎక్కింది. ఈ సర్చ్ ఇంజిన్ లో ఇడియట్ అని టైప్ చేసి... ఇమేజెస్ కోసం వెతికితే... భారీ సంఖ్యలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఫొటోలను చూపిస్తోంది. మానిటర్ మొత్తం ఆయన ఫొటోలతోనే నిండిపోతోంది. ట్రంప్ వ్యతిరేకులే దీనికి కారణమని సీఎన్ఈటీ అభిప్రాయపడింది. ట్రంప్ పై ద్వేషం ఉన్నవారు ట్రంప్ ఫొటోను అప్ లోడ్ చేసి, ఇడియట్ అనే పదాన్ని దానికి జత చేస్తున్నారు. ఈ విధంగా ఆయన వ్యతిరేకులు ముమ్మర ప్రచారాన్ని కొనసాగిస్తున్నారని ది గార్డియన్ పత్రిక తెలిపింది. ట్రంప్ పాలసీలు నచ్చని వారు ఈ క్యాంపెయిన్ లో భాగస్వాములుగా ఉన్నారని చెప్పింది. 
google
ediot
images
search
Donald Trump

More Telugu News