జనసేన పార్టీకి సొంత టీవీ ఛానల్ ను ఏర్పాటు చేసుకునే ప్రయత్నాల్లో ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఉన్నట్టు సమాచారం. ఇప్పటికే ఉన్న '99 న్యూస్' ఛానల్ ను ఆయన టేకోవర్ చేస్తున్నట్టు తెలుస్తోంది. సీపీఐ పార్టీ ఈ ఛానల్ ను ప్రారంభించింది. ఇటీవల ఓ కార్యక్రమం సందర్భంగా ఆ ఛానల్ కు చెందిన మైక్ ను పవన్ పరిశీలించారు. ఇదేనా మన ఛానల్ అని ప్రశ్నించారు. సమాజానికి మేలు చేసేందుకు, అవినీతిని ఎండగట్టేందుకు ఈ ఛానల్ మనకు ఉపయోగపడుతుందని ఆయన అన్నట్టు సమాచారం.
Play video