నా విమానం 'ఎయిర్ ఫోర్స్ వన్' రంగు బోల్డ్ గా ఉండాలి!: ట్రంప్ ఆదేశం
Add ap7am to your home Screen

నా విమానం 'ఎయిర్ ఫోర్స్ వన్' రంగు బోల్డ్ గా ఉండాలి!: ట్రంప్ ఆదేశం

  • ఎరుపు రంగుతో నింపనున్నాం
  • ప్రపంచంలోనే అత్యుత్తమమైనదిగా ఎయిర్ ఫోర్స్ వన్
  • అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్
'ఎయిర్ ఫోర్స్ వన్'... అగ్రరాజ్యాధినేత ప్రయాణించే అత్యంత ఆధునిక విమానం. అమెరికా అధ్యక్షుడి ప్రయాణాలకు మాత్రమే వాడే విమానం. ఆ విమానంపై వుండే నీలం, లేత నీలం రంగులు ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు నచ్చలేదట. అంతే.. వెంటనే దాని రంగును మార్చాలని ఆయన అధికారులను ఆదేశించారు. తన విమానం రంగు బోల్డ్ గా ఉండాలని, ఎరుపు రంగును వాడాలని ఆయన ఆదేశించారు. 'సీబీఎస్ న్యూస్'కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ట్రంప్ ఈ విషయాన్ని స్వయంగా తెలిపారు.

 "ఇప్పటికీ ఆ పాత బేబీ బ్లూ రంగులుండాలా? అవసరం లేదు. కొత్తగా ఏం రంగులు వేస్తున్నామో తెలుసా? ఊహించండి" అని "సీబీఎస్" ప్రతినిధి జెఫ్ గ్లార్ ను ప్రశ్నించిన ట్రంప్, ఎరుపు, తెలుపు, ముదురు నీలం రంగుల్లోకి ఎయిర్ ఫోర్స్ వన్ మారుతుందని తెలిపారు. రీ మోడల్ చేయబడిన తరువాత ఈ విమానం ప్రపంచంలోనే అత్యుత్తమమైనదిగా మారుతుందని ఆయన అన్నారు.

భవిష్యత్ అధ్యక్షుల అవసరాలనూ దృష్టిలో ఉంచుకుని దీన్ని రీ మోడలింగ్ చేస్తున్నట్టు చెప్పారు. కాగా, మొత్తం 3.9 బిలియన్ డాలర్ల వ్యయంతో రెండు కొత్త ఎయిర్ పోర్స్ వన్ విమానాలు కావాలని బోయింగ్ సంస్థకు అమెరికా సర్కారు ఇప్పటికే ఆర్డర్ ఇచ్చింది. 
Donald Trump
Air Force One
New Colour
Red
Blue
White

More Telugu News