హైదరాబాద్ ట్రాఫిక్ జామ్‌లో చిక్కుకున్న హీరో కార్తీ.. ఆటోలో సక్సెస్ మీట్‌కు!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

హైదరాబాద్ ట్రాఫిక్ జామ్‌లో చిక్కుకున్న హీరో కార్తీ.. ఆటోలో సక్సెస్ మీట్‌కు!

  • మాదాపూర్‌లో ట్రాఫిక్ జామ్
  • చిక్కుకుపోయిన కార్తీ
  • ఆటోలో ప్రసాద్ ల్యాబ్స్‌కు
కోలీవుడ్ ప్రముఖ నటుడు కార్తీ హైదరాబాద్‌ ట్రాఫిక్ జామ్‌లో చిక్కుకుని ఇబ్బంది పడ్డాడు. ‘చినబాబు’ సక్సెస్ మీట్‌కు హాజరయ్యేందుకు వచ్చిన ఆయన, ప్రొడ్యూసర్ రవీందర్‌రెడ్డితో కలిసి కారులో బయలుదేరాడు. మాదాపూర్ నుంచి ప్రసాద్ ల్యాబ్‌కు వస్తున్న వేళ సోమవారం రాత్రి మాదాపూర్‌లో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. అందులో చిక్కుకుపోయిన కార్తీ చాలాసేపు వేచి చూశాడు. అయినా ట్రాఫిక్ క్లియర్ కాకపోవడం, మరోవైపు సక్సెస్ మీట్ సమయం దగ్గర పడుతుండంతో ఏం చేయాలో తోచలేదు. చివరికి కారు నుంచి ఆటోలోకి మారి ప్రసాద్ ల్యాబ్స్‌కు చేరుకుని విజయోత్సవ సభకు హాజరయ్యాడు. ఆటోలో నుంచి దిగుతున్న కార్తీని చూసిన అభిమానులు ఆశ్చర్యానికి గురయ్యారు.

Hyderabad
Traffic
Karthi
Actor
Chinababu

More Telugu News