'చినబాబు' మూడు రోజుల వసూళ్లు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

'చినబాబు' మూడు రోజుల వసూళ్లు

  • కార్తీ హీరోగా వచ్చిన 'చినబాబు'
  • కథానాయికగా సాయేషా సైగల్ 
  • గ్రామీణ నేపథ్యంతో కూడిన కథ
కార్తీ .. సాయేషా సైగల్ జంటగా దర్శకుడు పాండిరాజ్  తమిళంలో 'కడైకూట్టి సింగం' సినిమాను తెరకెక్కించాడు. తెలుగులో 'చినబాబు' పేరుతో ఈ నెల 13వ తేదీన ఈ సినిమా విడుదలైంది. తెలుగు రాష్ట్రాల్లో తొలిమూడు రోజుల్లో ఈ సినిమా 2.74 కోట్ల రూపాయల షేర్ ను వసూలు చేసింది. మొదటి నుంచి కూడా కార్తీ తమిళంలోనే కాకుండా తెలుగులోను తన సినిమాలు విడుదలయ్యేలా చూస్తూ వస్తున్నాడు.

అందువలన తెలుగులోను ఆయనకి మంచి క్రేజ్ వుంది .. మంచి మార్కెట్ వుంది. రీసెంట్ గా వచ్చిన 'చినబాబు' గ్రామీణ నేపథ్యంతో కూడిన కథ కావడంతో పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. రైతు పాత్రలో కార్తీ మంచి నటనను కనబరిచాడనే టాక్ వచ్చింది. ప్రస్తుతం థియేటర్లలో 'ఆర్ ఎక్స్ 100' దుమ్మురేపేస్తుండటం వలన, ఈ సినిమా వసూళ్లపై కొంత ప్రభావం పడిందని చెప్పుకుంటున్నారు. లేదంటే ఈ సినిమా ఈ మూడు రోజుల్లో మరిన్ని వసూళ్లు రాబట్టి ఉండేదనే అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.             
karthi
sayesha

More Telugu News