బిగ్‌బాస్ హౌస్ నుంచి భానుశ్రీ అవుట్.. ఏడ్చేసిన దీప్తి సునయన!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

బిగ్‌బాస్ హౌస్ నుంచి భానుశ్రీ అవుట్.. ఏడ్చేసిన దీప్తి సునయన!

  • మైనస్‌గా మారిన భానుశ్రీ రచ్చ
  • టఫ్ కంటెస్టెంట్ నుంచి ఒక్కసారిగా కిందికి జారిన వైనం
  • వెళ్తూవెళ్తూ విజిలేసిన భాను
తెలుగు బిగ్‌బాస్-2 ఆసక్తికరంగా సాగుతోంది. ఈ వారం హౌస్ నుంచి భానుశ్రీ ఎలిమినేట్ అయింది. హౌస్‌లో టఫ్ కంటెస్టెంట్‌గా ఉన్న భాను అనూహ్య రీతిలో ఎలిమినేషన్‌లోకి వచ్చింది. టాస్క్‌లో భాగంగా అమిత్‌ను ఒప్పించడంలో విఫలమైన భానుశ్రీ ఎలిమినేషన్‌లోకి వచ్చింది. హౌస్‌లో చక్కగా ఆడుతున్న ఆమెపై పెద్దగా ఫిర్యాదులు లేనప్పటికీ హౌస్‌మేట్ కౌశల్‌పై చేసిన పరుష వ్యాఖ్యలు ఆమె ఎలిమినేషన్‌కు ప్రధాన కారణంగా మారాయని తెలుస్తోంది. హౌస్‌లో ఆమె చేసిన రచ్చ భానుకు మైనస్ అయింది. ఆమెకు ఓట్లు రాకపోవడానికి అదే కారణమని తెలుస్తోంది.

ఇక హౌస్ నుంచి భానుశ్రీ బయటకు వెళ్తుంటే టీం మొత్తం భావోద్వేగానికి గురైంది. దీప్తి సునయన ఆమెను పట్టుకుని వలవలా ఏడ్చేసింది. చివరగా విజిల్ వేసి నవ్వుతూ హౌస్ నుంచి బయటకు వెళ్లిన సునయన ‘బిగ్ బాంబ్’ను అమిత్, కౌశల్‌పై ప్రయోగించింది. ఇందులో భాగంగా అమిత్ కుర్చీలోనే కూర్చోవాలి. అతడు ఎక్కడికి వెళ్తే, అక్కడికి కౌశల్ ఆ కుర్చీని తీసుకెళ్లాలి.
BigBoss2
Bhanu sree
Nani
Actor

More Telugu News