సదా నటించిన చిత్రానికి సెన్సార్ ఇబ్బంది.. ట్రైబ్యునల్ కి వెళ్లిన నిర్మాతలు!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

సదా నటించిన చిత్రానికి సెన్సార్ ఇబ్బంది.. ట్రైబ్యునల్ కి వెళ్లిన నిర్మాతలు!

  • 'టార్చిలైట్' సినిమాకు సెన్సార్ సర్టిఫికేట్ నిరాకరణ
  • అశ్లీలత అధికంగా ఉండటమే కారణం
  • తొలి సారి వేశ్య పాత్రను పోషించిన సదా
సదా కీలక పాత్ర పోషించిన 'టార్చిలైట్' సినిమాకు సెన్సార్ సర్టిఫికేట్ ఇచ్చేందుకు ప్రాంతీయ సెన్సార్ బోర్డు నిరాకరించింది. వేశ్యావృత్తిలో నలిగిపోతున్న అమ్మాయిల నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. తన కెరీలోనే తొలిసారిగా సదా వేశ్య పాత్రను ఈ సినిమాలో పోషించింది.

ఇప్పటికే పోస్ట్ ప్రొడక్షన్ కారణాలతో ఈ చిత్రం విడుదలలో జాప్యం జరిగిందనుకుంటే, తాజాగా సెన్సార్ ఇబ్బంది కూడా ఎదురైంది. కొన్ని వారాల క్రితమే ఈ చిత్రాన్ని సెన్సార్ కు పంపగా... అశ్లీలత మోతాదు మరీ ఎక్కువగా ఉందన్న కారణంతో సర్టిఫికేట్ ఇవ్వడానికి బోర్డు నిరాకరించింది. దీంతో దర్శక నిర్మాతలు ఢిల్లీలో ట్రైబ్యునల్ ను ఆశ్రయించి... సర్టిఫికేట్ తెచ్చుకున్నట్టు కూడా వార్తలు వినిపిస్తున్నాయి. విజయ్ తో 'తమిళన్' సినిమాను తెరకెక్కించిన ఎ.మజీద్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు.
sadah
torchlight
censor
reject

More Telugu News