వరుసగా ఐదోరోజూ పెరిగిన 'పెట్రో' ధరలు... తాజా ధరల వివరాలు!

  • 5 నుంచి 7 పైసల వరకూ పెంపు
  • ఇంటర్నేషనల్ మార్కెట్లో పెరుగుతున్న క్రూడాయిల్ ధరలు
  • ఢిల్లీలో లీటరు పెట్రోలు రూ. 76.36
పెట్రోలు, డీజెల్ ధరలు వరుసగా ఐదోరోజూ పెరిగాయి. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ తన వెబ్ సైట్ లో ఉంచిన వివరాల ప్రకారం, నేడు పెట్రోలు ధర 5 నుంచి 7 పైసల వరకూ పెరిగింది. ఢిల్లీలో ప్రస్తుతం లీటరు పెట్రోలు రూ. 76.36 కాగా, చెన్నై, కోల్ కతా, ముంబైల్లో వరుసగా రూ. 79.25, రూ. 79.03, రూ. 83.75గా ఉంది.

ఇక డీజెల్ విషయానికి వస్తే, ఢిల్లీలో రూ. 68.07గా, ముంబైలో రూ. 72.23గా, కోల్ కతాలో 70.62గా, చెన్నైలో రూ. 71.85గా ఉంది. కాగా, పెట్రో ఉత్పత్తుల ధరలు మే 30 నుంచి జూలై 4 వరకూ తగ్గుతూ వచ్చిన సంగతి తెలిసిందే. ఆపై అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధరలు పెరుగుతూ ఉన్నందున పెట్రోలు, డీజెల్ ధరలను పెంచక తప్పడం లేదని ఆయిల్ కంపెనీలు అంటున్నాయి.
Go Back to Shorts
Petrol
Diesel
Crude Oil
Price Hike

More Telugu News