పెళ్లి కొడుకు ఇంటికి పోస్టల్ కవర్.. విప్పి చూసి పెళ్లి రద్దు చేసుకున్న వరుడు!
- స్పీడ్ పోస్టులో మొబైల్
- అందులో పెళ్లి కుమార్తె వీడియోలు
- పెళ్లి చేసుకునేది లేదన్న వరుడు
ఆ వీడియోల్లో వధువు స్నానం చేసిన అనంతరం దుస్తులు మార్చుకుంటున్నట్టు ఉంది. కాబోయే భార్య నగ్న దృశ్యాలను చూసిన వరుడు పెళ్లి చేసుకోబోనని తెగేసి చెప్పాడు. దీంతో వధువు కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణ చేపట్టిన పోలీసులు ఆ వీడియోల్లో ఉన్నవి మార్ఫింగ్ చేసిన దృశ్యాలని నిర్ధారించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కొరియర్ ఆధారంగా నిందితుల ఆచూకీ కోసం ప్రయత్నిస్తున్నారు.