మరో యుద్ధానికి సిద్ధమైన రిలయన్స్ జియో.. ప్రభుత్వానికి ఇప్పటికే సమాచారం!

  • జియో నుంచి త్వరలో వాయిస్ ఓవర్ వైఫై సేవలు
  • కాల్ డ్రాప్స్‌కు ఇక చెక్
  • గ్రామీణ వినియోగదారులకు వరం
టెలికం రం‌గంలో మరో యుద్ధానికి రిలయన్స్ జయో రెడీ అవుతోంది. ఈ రంగంలో ఇప్పటికే పాతుకుపోయిన భారతీ ఎయిర్‌టెల్, వొడాఫోన్‌లకు తిరుగులేని దెబ్బ కొట్టేందుకు అస్త్రశస్త్రాలు సిద్ధం చేస్తోంది. త్వరలోనే వాయిస్ ఓవర్ వైఫై సేవలను అందించనున్నట్టు జియో ఇప్పటికే ప్రభుత్వానికి సమాచారం అందించింది. వాయిస్ ఓవర్ వైఫై సేవల వల్ల సిగ్నల్ తక్కువగా ఉన్న, సరిగా అందని ప్రాంతాల్లోని వినియోగదారులకు కాల్ డ్రాప్స్ బెడద ఉండదు. సమీపంలోని వైఫైని ఉపయోగించుకుని కాల్స్ చేసుకోవచ్చు. గ్రామీణ ప్రాంత వినియోగదారులకు ఈ సేవలు ఎంతో కీలకం కానున్నాయి.

ఈ సేవల కోసం జియో తన 4జీ ఫీచర్ ఫోన్లకు అవసరమైన మార్పులు చేస్తున్నట్టు జియో సన్నిహిత వర్గాల ద్వారా తెలిసింది. జియో ప్రవేశపెట్టిన 4జీ ఫీచర్ ఫోన్లతో ఆ సంస్థ ఖాతాదారుల సంఖ్య ఒక్కసారిగా పెరిగింది. ప్రస్తుతం ఆ సంస్థకు 20 కోట్ల మంది వినియోగదారులు ఉన్నారు. ఇక 50 కోట్లమంది జియో ఫోన్లను ఉపయోగిస్తున్నారు.
Go Back to Shorts
Reliance
Jio
Telecom
Airtel
Wi-Fi

More Telugu News